కలం, నిర్మల్ : ప్రజావాణి (Prajavani) కి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా సత్వరమే పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందే ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

