కలం, కరీంనగర్: కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న సీనియర్ గణిత ఉపాధ్యాయుడు ఊరెడి ఆనంద్ యాదవ్ (Teacher Anand Yadav)కు ప్రతిష్టాత్మక “నేషనల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” లభించింది. నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉత్తమ బోధనా పద్ధతులు, సృజనాత్మక ఆవిష్కరణలు, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తాజాగా కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి, కాటారం తదితర వివిధ ప్రాంతాలలో విద్యా సేవలు అందించిన ఉశిరెడ్డి ఆనంద్ యాదవ్ ఈ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, స్థానికులు, ఆల్ఫార్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి ఆనంద్ యాదవ్కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

