కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని వార్డు నెం 17 అస్రా కాలనీలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ (Kishore Kumar) ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా SIR కేంద్రాన్ని సందర్శించి ఫారాల సేకరణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి SIR ఫారాలను తిరిగి సేకరించాలని సూచించారు. సేకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో నమోదు చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారాలు పూరించడంలో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని బీఎల్ఓలకు సూచించారు. ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసి, SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ఇందులో అర్బన్ తహశీల్దార్ రాజు, నాయకులు షేక్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

