కలం, వెబ్ డెస్క్ : నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం (Nigeria Plane Crash) చోటుచేసుకుంది. బెనిన్ సిటీ నుంచి లాగోస్ వైపు వెళ్తున్న నైజీరియా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ATR-42 సైనిక విమానం ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా నేవల్ బేస్ సమీపంలో హఠాత్తుగా కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 25 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది సహా మొత్తం 32 మంది ఉన్నారు.
రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన కొద్దిసేపటికే ఈ విషాదం జరిగింది. విమానంలో ఉన్న 32 మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు విమాన శకలాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.

