హైవేపై ఘోర ప్రమాదం.. మంత్రి డ్రైవర్ అక్కడికక్కడే మృతి!

కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripet) జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న తన్నీరు శ్రీహరి (38) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. శ్రీహరి తన బైక్ పై పట్టణ పరిధిలోని కొత్త బైపాస్ నుంచి పురుషోత్తమపట్నం వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో నరసరావు పేట నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు మలుపు తిరుగుతున్న సమయంలో శ్రీహరి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో శ్రీహరి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మృతుడి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీహరి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>