కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో నిర్వహించిన భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) జనరల్ బాడీ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు గూడెం లక్ష్మి వివరాలను వెల్లడించారు.
జిల్లా అధ్యక్షురాలిగా బీర్ల పద్మ, ప్రధాన కార్యదర్శిగా కొట్టె అంజలి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాగుల రేణుక, కాట్నపల్లి అఖిల, జి. వాణి బాధ్యతలు చేపట్టారు. సహాయ కార్యదర్శులుగా కందుకూరి సావిత్రి, నక్క కేతవ్వ, ఎలిశెట్టి భారతి, కోశాధికారిగా ర్యాకం మల్లిక ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసినట్లు గూడెం లక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు బీర్ల పద్మ, కొట్టె అంజలి మాట్లాడుతూ.. మహిళల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో తక్కువ వేతనాలు, వివక్షతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు మహిళా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని, అత్యాచారాలు, హత్యలు, వరకట్న వేధింపులకు గురవుతున్న బాధితులకు బాసటగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా భారత జాతీయ మహిళా సమాఖ్యను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

