Mobile Popup Ad
Mobile Popup Ad

బాన్సువాడలో అమానవీయం.. రోడ్డు పక్కన పసికందు

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మదీన కాలనీలోని ఖాళీ స్థలంలో ఓ మగ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పసికందు అరుపులు గమనించిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. నవజాత శిశువును పోలీసులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే ఏ కుక్కలో ఇతర జంతువులో చూసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>