epaper
Sunday, March 1, 2026
epaper

టీ20 వరల్డ్​ కప్​ : కివీస్​తో మ్యాచ్​.. ఇంగ్లాండ్ టార్గెట్ 160

కలం, వెబ్​ డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​ సూపర్​–8​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లు శక్తివంచన లేకుండా పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి, ఇంగ్లండ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. కివీస్​ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టిమ్ సీఫర్ట్ 35 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 29 పరుగులు జోడించాడు. రచిన్ రవీంద్ర 11 పరుగులు, మార్క్ చాప్​మన్​ 15 పరుగులు చేశారు. చివర్లో మిచెల్ సాంట్నర్ నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రేహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. లియామ్ డాసన్ ఒక వికెట్ సాధించాడు. మొత్తంగా కివీస్​ (New Zealand)159 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ విజయానికి 160 పరుగులు అవసరం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!