వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

కలం, ఖమ్మం బ్యూరో: కూతురు వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం(Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పడమటి తండాలో బానోతు సాయి మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సాయి, తన ఇంటి పక్కనే ఉంటున్న రామచంద్రూ అనే వాచ్‌మెన్ పెద్ద కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈమె కొంత కాలంగా భర్తకు దూరంగా ఇద్దరు పిల్లలతో తండ్రి ఇంట్లోనే ఉంటుంది.

రామచంద్రూ, ఖమ్మం (Khammam) రూరల్ బారుగూడెంలో వాచ్‌మెన్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ పెళ్లిలో కలిసిన సాయిని, తన కూతురుతో వివాహేతర సంబంధంపై రామచంద్రూ నిలదీయడంతో, ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో సాయి.. రామచంద్రూపై కత్తితో దాడి చేశాడు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం సాయి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. రామచంద్రూ మరణంతో పడమటి తండాలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మృతుడి బంధువులు సాయిని చంపుతామంటూ పట్టుబట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఖమ్మం హాస్పిటల్‌కు  తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>