కలం, డెస్క్ : చెన్నై వేదికగా టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) న్యూజిలాండ్ బ్యాటింగ్ తుఫాన్ ఊచకోత కోసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ రికార్డు భాగస్వామ్యంతో యూఏఈను 10 వికెట్లతో చిత్తు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 173 పరుగులు సాధించింది. కెప్టెన్ మహ్మద్ వసీమ్ అజేయంగా 66 రన్స్ తో జట్టుకు కీలక స్కోరు అందించారు. వసీమ్, అలిషాన్ షరఫు కలిసి రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. అయితే మార్క్ చాప్మన్ అద్భుత ఫీల్డింగ్‌తో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ (New Zealand) ఓపెనర్లు మొదటి నుంచే దూకుడు చూపించారు. పవర్‌ప్లేలోనే 78 రన్స్ తో వచ్చాయి. కేవలం 8.3 ఓవర్లలోనే శతక భాగస్వామ్యం నమోదైంది. టిమ్ సీఫర్ట్ 89 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫిన్ అలెన్ 84 పరుగులు చేసి పూర్తి సహకారం అందించారు. ఈ జోడీ 15.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ 175 పరుగుల అజేయ భాగస్వామ్యం టీ20 ప్రపంచకప్ (T20 World Cup) చరిత్రలో కొత్త రికార్డుగా నిలిచింది.
గతంలో ఇంగ్లాండ్ జోడీ చేసిన 170 పరుగుల రికార్డు ఇక చరిత్రగా మారింది. మ్యాచ్ తర్వాత సీఫర్ట్ మాట్లాడుతూ.. పవర్‌ప్లేలో బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి మ్యాచ్ పరిస్థితులకు తగినట్లుగా ఆడటం కీలకమని చెప్పారు. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు టోర్నీలో తన ఆధిపత్యాన్ని బలంగా చాటింది.
Read Also: టైటాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుకేష్
Follow Us On: Sharechat


