కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి చౌటి భూమేశ్వర్ పర్యవేక్షణలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాద్రి, సలహాదారులు అమృతాపూర్ గంగాధర్, ఎస్సార్ సత్యపాల్, బిళ్ళ మహేష్, బొట్టు వెంకటేష్ ల సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ముగిసింది. ఈ నూతన కార్యవర్గం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల కాలపరిమితితో బాధ్యతల్లో కొనసాగనుంది. పద్మశాలి సామాజికవర్గ అభివృద్ధికి, సంస్థ నియమావళికి లోబడి నిబద్ధతతో సేవ చేస్తామని నూతన సభ్యులు స్పష్టం చేశారు.
నూతన కార్యవర్గం ప్రమాణం..
అధ్యక్షులు భీమర్తి రవి, ప్రధాన కార్యదర్శి కొండవత్రి రాజేందర్ (లక్కోర), కోశాధికారి మేక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు క్యాతం జగన్మోహన్, తేలి ప్రదీప్, చిలువేరి గణేష్, సహాయ కార్యదర్శి ఇరుముల్ల శివలింగం, సురుకుట్ల భాస్కర్, అంకం రాజేందర్, ప్రచార కార్యదర్శి పల్నాటి రఘు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ధోర్నాల రవి, ఈసీ మెంబర్స్ శ్రీరాం దత్తాద్రి, గోవిందరాజులు, గంగుల రవి, గుండెల్లి కృష్ణ లు ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: విజయ్‌ని గెలిపించినందుకు బాధపడుతున్నారు: స్టాలిన్
Follow Us On: Instagram

