Mobile Popup Ad
Mobile Popup Ad

అరుణాచలంలో గ్యాస్ కొరత.. ఉచిత లడ్డూ పంపిణీ నిలిపివేత

కలం, వెబ్ డెస్క్ : గ్యాస్ కొరత అరుణాచలం (Arunachalam) ఆలయాన్ని కూడా తాకింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇండియాలో గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కొరత తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి (Arunachalam) ఆలయాన్ని కూడా తాకింది. దీంతో ఆలయంలో ఉచిత లడ్డూ ప్రసాద పంపిణీని నిలిపివేశారు. ఇక్కడ భక్తులకు లడ్డూను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు ఆలయ నిర్వాహకులు. అయితే ఆయలంలో గ్యాస్ కొరత ఎక్కువ కావడంతో లడ్డూ పంపిణీ చేయలేమని నిర్వాహకులు తెలిపారు. కాగా భక్తుల కోరిక మేరకు కట్టెల పొయ్యిపై లడ్డూ తయారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కట్టెల పొయ్యిపై లడ్డూలు తయారు చేసి పంపిణీ చేస్తామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>