లౌసాన్ లీగ్‌లో దూసుకెళ్లిన నీరజ్.. శ్రీలంక అథ్లెట్‌కు అగ్రస్థానం!

కలం, స్పోర్ట్స్: భారత అథ్లెట్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్విట్జర్లాండ్‌లో జరిగిన లౌసాన్ డైమండ్ లీగ్ జావెలెన్ త్రో పోటీల్లో 88.05 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. కేవలం తొమ్మిది సెంటీమీటర్ల స్వల్ప తేడాతో ఆయనకు అగ్రస్థానం చేజారింది. పోటీ ప్రారంభంలో నీరజ్ తన మొదటి ప్రయత్నంలో 83.54 మీటర్ల దూరం వేశారు. అదే సమయంలో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే తొలి ప్రయత్నంలోనే 85.99 మీటర్లు, రెండో ప్రయత్నంలో 87.06 మీటర్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు.

ఆ తర్వాత నీరజ్ చోప్రా పుంజుకుని, తన రెండో ప్రయత్నంలో 88.05 మీటర్లు విసిరి ప్రథమ స్థానానికి చేరుకున్నారు. అయితే పతిరాగే తన మూడో ప్రయత్నంలో ఈటెను 88.14 మీటర్ల దూరానికి విసిరి మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. చివరి రౌండ్ల వరకు ఇద్దరూ ఈ మార్కులను దాటలేకపోయారు. ఫలితంగా రుమేష్ పతిరాగే ప్రథమ స్థానంలో నిలవగా, నీరజ్ చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ (86.69 మీటర్లు) మూడో స్థానాన్ని, కేశోర్న్ వాల్కాట్ (83.71 మీటర్లు) నాలుగో స్థానాన్ని సాధించారు. మార్క్ ఆంథోనీ మినీచెల్లో, కర్టిస్ థాంప్సన్, జాకుబ్ వాద్లేజ్, ఆర్టూర్ ఫెల్ఫ్నర్, సైమన్ వీలాండ్ వరుసగా తదుపరి స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానం, కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో స్థానం సాధించిన నీరజ్, 86 మీటర్ల మార్కు దాటలేకపోయారు.

ఇప్పుడు లౌసాన్‌లో 88 మీటర్ల మార్కును అందుకోవడం ఆయన ఫామ్‌కు సానుకూల సంకేతంగా మారింది. పోటీ అనంతరం నీరజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను మళ్లీ పూర్వఫామ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, ఈ ప్రదర్శన తనలో నమ్మకాన్ని పెంచిందని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఈ ప్రదర్శన ఆయన తదుపరి టోర్నీలకు మంచి ఊతాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>