Mobile Popup Ad
Mobile Popup Ad

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే?

క‌లం, వెబ్ డెస్క్‌: మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు(Gold Silver Prices) అంతుప‌ట్ట‌ని రీతిలో మారుతున్నాయి. ఒక‌రోజు అమాంతం ప‌డిపోతుంటే.. మ‌రొక రోజూ భారీగా పెరిగిపోతున్నాయి. అయితే గ‌త రెండు మూడు రోజుల నుంచి స్వ‌ల్ప మార్పుల‌తోనే కొన‌సాగుతున్నాయి. తాగాజా నేడు ఉద‌యం మ‌రోసారి బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold) బుధ‌వారం రూ.1,59,440 ఉండ‌గా గురువారం ఉద‌యం రూ.5,020 త‌గ్గి రూ.1,54,420కు చేరుకుంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధ‌వారం రూ.1,46,150 ఉండ‌గా గురువారం ఉద‌యం రూ.4,600 త‌గ్గి రూ.1,41,550కు చేరుకుంది. మ‌రోవైపు వెండి ధ‌ర(Silver Prices) కూడా భారీగా త‌గ్గింది. కిలో వెండి ధ‌ర బుధ‌వారం రూ.3,20,000 ఉండ‌గా గురువారం ఉద‌యం రూ.20,000 త‌గ్గి రూ.3,00,000కు చేరుకుంది.

Read Also: ప్రోటీన్ ఫైబర్‌తో కిచిడీకి హెల్తీ అప్‌గ్రేడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>