రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)(NTR Vaidya Seva) పథకం నిలిచిపోనుంది. ఈ మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెల్లించాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

కాగా, ఏప్రిల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్ పద్ధతిని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్న వేళ  ఈ విధానంపై ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 2017 నాటి పాత ప్యాకేజీ ధరలను ఇప్పటికి కొనసాగిస్తూ పెరిగిన వైద్య ఖర్చులు అలాగే ఆసుపత్రిలో నిర్వహణ భారంతో పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు పాత బకాయిల సంగతి తేల్చకుండానే ఇలా కొత్త ఇన్సూరెన్స్ మోడల్ కి మారితే ఆ రూ .3 వేల కోట్ల బకాయిల బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. బకాయిలు అందకపోవడంతో చిన్న చిన్న ఆసుపత్రులు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడిందని.. ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ ధరలను సవరించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>