కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు (Nationwide Strike) పిలుపునిచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, వివిధ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కొత్త లేబర్ కోడ్‌ల (Labour Codes) అమలుతో కార్మికులు ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్ల వంటి కీలక ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కార్మిక హక్కులను కుదించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల భద్రత, ఉపాధి హక్కులు, సామాజిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సమ్మె (Nationwide Strike) కారణంగా రవాణా, బ్యాంకింగ్, బీమా, పోస్టల్ సేవలు, పారిశ్రామిక రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
Read Also: ఓం బిర్లా పై అవిశ్వాస బాంబు.. చరిత్ర ఏం చెబుతోంది?
Follow Us On: Instagram


