మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వనపర్తి (Wanaparthy) జిల్లాలో “నషా ముక్త్ భారత్ సప్తాహ్” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. సుధారాణి, డీసీపీఓ ఎం. రాంబాబు, జిల్లా బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సీడీపీఓలు), డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్ కో-ఆర్డినేటర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>