ఇద్దరు కలెక్టర్లకు జాతీయ స్థాయి అవార్డులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka), నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన కార్యక్రమం అమలులో వారి సేవలను గుర్తించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీలో అవార్డులను అందించింది. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించడం విశేషం. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తున్నారంటూ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>