ఇండియా అద్భుత విజయంపై లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్ : నేడు కొలంబో(Colombo)లో టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా  ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో.. టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. యంగ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను కొనియాడారు.

“భయమెరుగని, ధైర్యవంతమైన, అద్భుతమైన బ్యాటింగ్” అంటూ లోకేశ్  ప్రశంసించారు. అలాగే భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనపై కూడా లోకేశ్ ప్రశంసలు వ్యక్తం చేశారు. సమిష్టిగా వేటాడినట్లుగా ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. టీమ్ ఇండియా విజయంపై గర్వంగా ఉంది. దేశానికి గర్వకారణమైన ప్రదర్శన చేశారని లోకేశ్ ట్వీట్‌లో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>