Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు తార‌క‌ర‌త్న వ‌ర్ధంతి.. నారా లోకేశ్ నివాళులు

క‌లం, వెబ్ డెస్క్‌: నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) మూడో వర్ధంతి సంద‌ర్భంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తారకరత్నకు నివాళి అర్పించారు. ఈ మేర‌కు లోకేశ్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. మా కుటుంబసభ్యుడు, మా బావ నందమూరి తారకరత్న భౌతికంగా దూరమైనా తన జ్ఞాపకాలు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటాయ‌ని లోకేశ్ పేర్కొన్నారు. తార‌క‌ర‌త్న‌ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా  తారకరత్నను స్మరిస్తూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. తార‌క‌ర‌త్న‌ చూపిన వినయం, దృఢ సంకల్పం ఎన్నో మ‌రుపురాని జ్ఞాపకాల‌ను మిగిల్చింద‌న్నారు. ఆయన ఎల్లప్పుడూ గుర్తుండిపోతార‌ని పోస్ట్ చేశారు. నందమూరి కుటుంబ‌స‌భ్యులు, అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మూడేళ్ల క్రితం నారా లోకేశ్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో తార‌క‌ర‌త్న గుండెపోటుతో మ‌ర‌ణించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>