కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్‌తో(Edgar Pang Tze Chiang) ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానం, అలాగే పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. సింగపూర్ సహకారం ద్వారా రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Read Also: జనసేన ఎన్నికల వ్యూహం వెల్లడించిన నాగబాబు
Follow Us On: Instagram

