Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఇందిరమ్మ ఇండ్లకు అటవీశాఖ అడ్డంకులు తొలగించాలి’

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలంలోని సోనాపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అర్కాయి తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు కల్పిస్తున్న అడ్డంకులను తొలగించాలని కోరుతూ గ్రామానికి చెందిన లబ్ధిదారులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా లంబాడ, మథుర జాతులకు చెందిన కుటుంబాలు అటవీ ప్రాంతంలోని గుడిసెల్లో నివసిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు శాశ్వత నివాసం కల్పించాలనే ఆశతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను నిర్మించుకోవాలనుకుంటున్నామని, కానీ అధికారుల అడ్డంకులతో అది సాధ్యం కావడం లేదని వాపోయారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

Read Also: లబ్ధిదారులకు అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’కు కొత్త రూల్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>