Mobile Popup Ad
Mobile Popup Ad

FDI ఆకర్షణలో ఏపీ ముందంజ.. లోకేశ్ హర్షం

కలం, వెబ్ డెస్క్ : భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉండటం గర్వంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. #ChooseSpeedChooseAP హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పంచుకున్నారు. భారత్‌లో 2025లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని, ముఖ్యంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ వంటి పెట్టుబడులు ఇందుకు దోహదం చేశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదికను ఆయన ప్రస్తావించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>