కలం, వెబ్ డెస్క్ : జేఎన్‌టీయూహెచ్ (JNTUH) క్యాంపస్‌లోని మంజీర బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. గురువారం రాత్రి తయారు చేసిన చోలే కూరలో బల్లి ప్రత్యక్షమవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో హాస్టల్‌లో కేవలం కేర్‌టేకర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.
హాస్టల్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్ కార్యాలయంలో లేకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు విధిగా హాస్టళ్లలోనే ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆహార భద్రత, హాస్టల్ పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : గోడను ఢీకొట్టి గాల్లో పల్టీలు.. శంషాబాద్‌లో ఘోర కారు ప్రమాదం!
Follow Us On : WhatsApp

