కలం, సినిమా : నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’(The Paradise) నుంచి సెకండ్ సింగిల్ ‘యేశనాగుల’ (Yeshanagula) లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాట థియేటర్లలో మాస్ జాతరను తలపించేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మరోసారి మాస్ ట్యూన్‌తో అదరగొట్టాడు. ‘నాటు మాస్’ టచ్‌తో రూపొందిన ఈ పాటలో అదిరిపోయే బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ పాటలో క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh) నానితో కలిసి మాస్ స్టెప్స్ వేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఆయా షేర్’ సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా.. తాజాగా రిలీజ్ అయిన ‘యేశనాగుల’ పాటతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ మాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా (The Paradise) కావడంతో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ యాక్షన్, పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ది ప్యారడైజ్’ మూవీ 2026,సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read : నాగ్ 100వ చిత్రం గ్లింప్స్.. వింటేజ్ లుక్‌లో కింగ్!
Follow Us On: X(Twitter)

