కలం, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy)ఎక్స్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, అధికారిక ప్రోటోకాల్స్‌ను పూర్తిగా పాటిస్తామని నాని పేర్కొన్నారు. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు.
నాని విజ్ఞప్తికి సీఎం సానుకూల స్పందన
నాని చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ అనుమతి కోరినందుకు నానిని అభినందించారు. అదే సమయంలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ప్రతిభను సీఎం ప్రశంసించారు. ‘ది ప్యారడైజ్’ (The Paradise) వంటి భారీ చిత్రాల ప్రదర్శన సమయంలో అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసమూహ నియంత్రణపై ప్రత్యేక దృష్టి అవసరమని సీఎం పేర్కొన్నారు.
పోలీసుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అనుమతుల కోసం నాని అధికారికంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం పోలీసులు అక్కడి పరిస్థితులు, జనసమూహ నియంత్రణ, భద్రతా అంశాలను పూర్తిస్థాయిలో అంచనా వేసి తగిన నిర్ణయం తీసుకుంటారని సీఎం తెలిపారు.
Also Read : నంది పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Follow Us On : WhatsApp

