చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్‌ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రభావితమైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులను సందర్శించిన కలెక్టర్‌, అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైన చికిత్స, మందులు, వైద్య పర్యవేక్షణ తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు. అవసరమైన అన్ని వైద్య సేవలను అందించడంతో పాటు, మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. చికిత్సలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>