డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. నంద్యాలలో ఘోర ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. హనుమకొండ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది (Nandyal Bus Accident). ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డివైడర్‌ను ఢీకొట్టడంతో బస్సు ఒక్కసారిగా ఊగిపోయి నిలిచిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ అతివేగం, తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ఉన్న ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>