కోర్టు బెయిల్.. విడుదలైన తాత మధు, నవీన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: స్పీకర్‌‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు (Tata Madhu), నవీన్ కుమార్ రెడ్డిలకు ఊరట లభించింది. ఈ మేరకు ఇద్దరు నేతల రిమాండ్‌ను మంగళవారం నాంపల్లి కోర్టు తిస్కరిస్తూ బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల చొప్పున షూరిటీలు సమర్పించిన తర్వాత వీరిని విడుదల చేయాలని ఆదేశించింది.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వాదనల అనంతరం రిమాండ్ ను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది. అటు  బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు శాసనసభకు బయల్దేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>