‘రణబాలి’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

కలం, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ  ‘రణబాలి’(Ranabaali). ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ‘రణబాలి’ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘Revealing the Savages Oath’ అంటూ మేకర్స్ టీజర్‌పై ఆసక్తిని పెంచారు. సెప్టెంబర్ 9న సాయంత్రం 4:05 గంటలకు ‘రణబాలి’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మూవీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరికొత్త మాస్ అవతార్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘రణబాలి’ మూవీ 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>