కలం, వెబ్ డెస్క్: వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)కు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన గుంటూరు కోర్ట్ అంబటికి రూ.10 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై (Chandrababu) చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అంబటిపై నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది.
ఈ నేపథ్యంలో అంబటి రాజమండ్రి జైలు (Rajahmundry Jail) నుంచి మరికొద్ది సేపట్లో విడుదల కానున్నారు. అంబటి (Ambati Rambabu) జైలు నుంచి బయటకు రాకముందే ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ దర్శనమిచ్చింది. దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు అంటూ అంబటి అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
Read Also: భారత్, యూఎస్ డీల్.. ప్రమాదంలో మన డేటా: రాహుల్
Follow Us On: Instagram


