Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో కారు బీభత్సం

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) పట్టణం, హైదరాబాద్ (Hyderabad) రోడ్డులోనీ అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్ద అర్ధరాత్రి వేళ ఒక కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ప్రసాద్ ఉడిపి హోటల్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డుపై పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు (Municipal Worker) అన్నపూర్ణను సైతం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న యువకుడితోపాటు పారిశుద్ధ్య కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ఊడుస్తున్న అన్నపూర్ణమ్మ అనే మున్సిపల్ కార్మికురాలికి రెండు కాళ్లు విరిగిపోయాయి. స్కూటీపై వెళ్తున్న యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో నల్గొండ (Nalgonda)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు  తరలించారు.

కారు డ్రైవర్ వరుణ్ తేజ్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నల్లగొండలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే తన ఎలక్ట్రిక్ వాహనానికి చార్జింగ్ పాయింట్ మూసివేస్తారనే కంగారులో అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అని పరీక్షించగా, నెగటివ్ అని తేలింది. కేవలం అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: భద్రాద్రి రామయ్య ఆదాయం ఎంతో తెలుసా?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>