Mobile Popup Ad
Mobile Popup Ad

లెబనాన్​పై ఇజ్రాయెల్​ రసాయనిక దాడి!

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియా యుద్ధంలో మరో దారుణ కోణం బయటపడింది. ఇప్పటికే ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దళాలు విరుచుపడుతున్న సంగతి తెలిసిందే. పది రోజులుగా ఇరాన్​పై ఇజ్రాయెల్–అమెరికా (Israel – US)​ దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్​తోపాటు ఇస్ఫహాన్​, మషాద్​ తదితర నగరాలను లక్ష్యంగా చేసుకొని చెలరేగుతున్నాయి. ఇరాన్​ సైతం మిస్సైళ్లు, డ్రోన్లతో దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్​కు మద్దతుగా లెబనాన్​ నుంచి హెజ్బొల్లా దళాలు బరిలోకి దిగడంతో ఆ దేశాన్ని ఇజ్రాయెల్​ టార్గెట్​ చేసుకుంది. తమ దేశానికి సరిహద్దులోని లెబనాన్​ నగరాలు, పట్టణాలపై దాడులు చేస్తోంది. అయితే, ఈ దాడులకు సంబంధించి అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణకు పాటుపడే హ్యూమన్​ రైట్స్​ వాచ్​(Human Rights Watch) సంచలన ఆరోపణలు చేసింది. లెబనాన్​పై ఇజ్రాయెల్​ రసాయనిక దాడి చేసినట్లు వెల్లడించింది.

ఈ సంస్థ చెబుతున్నదాని ప్రకారం.. ఈ నెల 3వ తేదీన లెబనాన్​లోని యొహ్మోర్​ పట్టణంపై ఇజ్రాయెల్​ సైన్యం ఫిరంగులతో దాడికి దిగింది. ఇందులో తెల్లని భాస్వరం, అనుబంధ రసాయనాలను ప్రయోగించింది. వీటికి సంబంధించిన ఫొటోలను హ్యూమన్​ రైట్స్​ వాచ్​ విడుదల చేసింది. ఇందులో యొహ్మోర్​ వద్ద ఇజ్రాయెల్ సైన్యం తెల్లని భాస్వరం ఉన్న మందుగుండుతో కనిపించడం, అలాగే ఫిరంగుల ప్రయోగంతో కార్లతోపాటు ప్రజలకూ మంటలు అంటుకోవడం గమనించవచ్చు. దీనిపై హ్యూమన్​ రైట్స్​ వాచ్​లో (Human Rights Watch) పనిచేసే రీసెర్చర్​ రమ్​జీ కయీస్​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెల్ల భాస్వరం దుష్రభావాలు ప్రజలపై దీర్ఘకాలం ఉంటాయన్నారు. అంతర్జాతీయ, మానవ హక్కుల చట్టాలకు విరుద్ధమైన ఇలాంటి రసాయనిక దాడులను ఇజ్రాయెల్​ ఆపాలని ఆయన డిమాండ్​ చేశారు.

తెల్ల భాస్వరం ఏం చేస్తుందంటే..

ఆయుధాల ద్వారా తెల్ల భాస్వరం ప్రయోగించినప్పుడు అది గాలితో సంయోగం చెంది మండుతుంది. తీవ్రమైన గాయాలు, శ్వాస కోశ సమస్యలు కలిగిస్తుంది. దీని బారిన పడినవాళ్లకు జీవితాంతం ఇబ్బందులు తలెత్తుతాయి. భూములు సారం కోల్పోతాయి. పంటలు పండడం కష్టమవుతుంది. అందువల్లే ఇలాంటి రసాయనిక దాడులను పర్యావరణ, ఆరోగ్య నేరంగా పరిగణిస్తారు. ఇప్పటికే ఇలాంటి రసాయనాలను ఇజ్రాయెల్​ తమ సరిహద్దులోని జోర్డాన్​ ప్రాంతంలో ఉన్న పంట భూములపై పిచికారీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఏళ్ల తరబడి పంటలు పండకపోవడంపై వ్యవసాయాధికారులు చేసిన పరిశోధనలో రసాయనాల వల్ల సమస్య ఉత్పన్నమైనట్లు గుర్తించడం దీనికి నిదర్శనం.

Read Also: ఇరాన్​కే మద్దతు : పుతిన్ సంచలన ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>