కలం, వెబ్ డెస్క్: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం (Fine Rice) పంపిణీ చేయాలన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఈ పథకం క్రెడిట్ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం కోసం ఏటా 14,560 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం పెట్టి ఆలోచన చేస్తున్నామన్నారు.
ప్రభుత్వానికి భారమైనా..
ఈ పథకం ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో భారం అయినప్పటికీ అమలు చేస్తున్నామని చెప్పారు. జనం తినే బియ్యమే వారికి రేషన్ దుకాణాల్లో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో 86% జనాభాకు సన్న బియ్యం అందుతున్నదని చెప్పారు. సోనియా గాంధీ తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలోకి 40,000 కోట్లు జమచేసినట్టు ఉత్తమ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేశామని చెప్పుకొచ్చారు. రాజకీయాలకతీతంగా అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కోట్ల 39 లక్షల మంది సన్నబియ్యం లబ్ధిదారులున్నారని ఉత్తమ్ (Uttam Kumar Reddy) చెప్పారు.
Read Also: మావోయిస్టు గణపతికి మెరుగైన వైద్యం అందిస్తాం : డీజీపీ
Follow Us On : WhatsApp

