నూతన వ్యాపార కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

కలం, వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నయీమ్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SGM కాకతీయ ఫ్యాబ్రిక్, యునైటెడ్ హక్ వస్త్ర షోరూమ్‌లను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగ వేళ నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని షోరూమ్ నిర్వాహకులకు ఎమ్మెల్యే (Naini Rajender Reddy)  సూచించారు. నూతన వ్యాపారాల ద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి షోరూమ్‌ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయినికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>