Mobile Popup Ad
Mobile Popup Ad

దేశవ్యాప్తంగా ‘నాగబంధం’ మూవీ అడ్వెంచర్ టూర్

కలం, సినిమా : టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘నాగబంధం’(Nagabandham) చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పుతోంది. హీరో విరాట్ కర్ణ (Virat Karrna) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నభా నటేష్, దక్షా నగార్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటులు అనసూయ భరద్వాజ్, జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ‘అభిషేక్ నామా’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

తిరువనంతపురంలోని పురాతన నేలమాళిగలు, రహస్య నిధులు, సాహసోపేత ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ విభిన్నమైన సినీ అనుభూతిని అందించనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ‘నాగబంధం అడ్వెంచర్ టూర్’ నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ అడ్వెంచర్ టూర్‌ను జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంతో శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం దేశంలోని పలు ప్రధాన నగరాలలో భారీ ఈవెంట్లు, అభిమానులతో ప్రత్యేక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షోతో ఈ టూర్ ముగియనుంది. భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, సస్పెన్స్‌తో కూడిన అడ్వెంచర్ కథాంశంతో రూపొందుతున్న ‘నాగబంధం’ చిత్రం 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఈ అడ్వెంచర్ టూర్‌తో మరింత హైప్ క్రియేట్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>