Mobile Popup Ad
Mobile Popup Ad

భూకబ్జా కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రిమాండ్

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా గండిపేటలో రూ.వేల కోట్ల విలువైన 9.10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి(Bolla Brahmanaidu)ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఈ నెల 20 వరకు జ్యుడీషయల్ రిమాండ్ విధించింది.

కాగా, ఈ కేసులో గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న బ్రహ్మనాయుడును శుక్రవారం సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని శనివారం ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడు తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ భూకబ్జాకు సంబంధించిన కేసును పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>