Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్

కలం, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టులో (AP High Court) తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) నియామకం అయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సు చేయగా.. రాష్ట్రపతి ఆమోదముద్రతో కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ స్థానంలో 25న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె సీనియార్టీ పరంగా సీజే తరువాత రెండో స్థానంలో ఉన్నారు. పంజాబ్ హైకోర్ట్ నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్ గత నెల 12న ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

న్యాయ శాస్త్రంలో నిష్ణాతురాలు..

జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) చండీగఢ్ లో జన్మించారు. ప్రాథమిక విద్య తరువాత పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేసి, 1990లో లాయర్ గా తన పేరు నమోదు చేయించుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సుదీర్ఘ కెరీర్ లో జస్టిస్ లిసా గిల్.. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో పూర్తి స్థాయి పట్టును సాధించారు. 2014లో పంజాబ్ కోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది.. ఇటీవలే ఏపీకి బదిలీపై వచ్చారు. ఇప్పుడు సీజేగా పదోన్నతి పొంది.. తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పబోతున్నారు.

Read Also: బుద్ధుందా.. జనసేన నేతలపై నాగబాబు సీరియస్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>