మిస్టరీ థ్రిల్లర్‌గా వృషకర్మ.. ట్రైలర్ విడుదల

కలం, సినిమా: నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma)విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు.

మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల కలయికతో సరికొత్త కథాంశాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవు నువ్వే…’ అంటూ వినిపిస్తున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా.. ఈ సినిమాకు అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>