కలం, కరీంనగర్ బ్యూరో: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షా మార్చ్ – రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు కరీంనగన్ నుంచి కాంగ్రెస్ (Karimnagar Congress) శ్రేణులు భారీగా తరలివెళ్లారు. రెండు బస్సులు, నాలుగు కార్ల కాన్వాయ్ కు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో వరాల నర్సింగం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, అహమ్మద్ అలీ, నాత శ్రీనివాస్, వంగల విద్యాసాగర్, ఫహాద్, కపిల్ మాధవ్, మాజీద్ అలీ ఖాన్, కుంభాల రాజ్ కుమార్, కలిముద్దీన్, మిర్యాల శ్రీధర్ రెడ్డి, పెంట శేఖర్, గడప అజయ్, ఇమ్రాన్ ఘనీ, శిల్ప, సత్రం శ్రీకాంత్, కాటోజు అశోక్, పొన్నాల రాజేష్, కదిరుల్లా, తిరుపతిరెడ్డి, ఆశిష్ రెడ్డి, గడ్డి రమేష్, కే.చిట్టు, ఎన్. శివ, జి. శ్రీధర్, పి.వాసు గౌడ్, అక్క పెళ్లి మల్లేశం, వి.చంద్రయ్య, యు.శివ, ఎం.తరుణ్, ఇమ్రాన్, అక్బర్ లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

