Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం జిల్లాలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి

కలం/ఖమ్మం బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం నేటితో ముగిసింది. దీంతో ఖమ్మం (Khammam) జిల్లాలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలు అవ్వనుంది. ఉమ్మడి జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) అమలులో ఉండనుంది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్ 209 ప్రకారం, నిశ్శబ్ద వ్యవధి సమయంలో ఎవరూ ఎన్నికలతో సంబంధం ఉన్న బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదు. ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేయడం, సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం పూర్తిగా నిషేధం.

అలాగే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపడం లేదా ఇతర ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ ఎన్నికల ప్రచారం చేయడం చట్ట విరుద్ధం. నిశ్శబ్ద వ్యవధి సమయంలో సోషల్ మీడియాలో ప్రసారం అయ్యే సందేశాలను నిశితంగా ఎన్నికల అధికారులు పరిశీలిస్తుంటారు. ఈ రూల్స్ అతిక్రమించిన వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. జిల్లాలో (Khammam) ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్ కేంద్రాల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు కూడా చేపడుతున్నారు.

Read Also: కలం 360 డిగ్రీస్: మున్సిపోల్స్ స్పెషల్

Follow Us On : WhatsApp
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>