కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ (Parliament)లో విపక్షాల ఆందోళనతో గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష ఎంపీల తీరుపై కేంద్ర మంత్రి కిరిణ్ రిజిజు (Kiren Rijiju) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు గల్ఫ్ పై చర్చించాలా? లేక స్పీకర్ అవిశ్వాసంపై చర్చించాలా? అన్న డైలమాలో ఉన్నారని విమర్శించారు. సభ్యుల ఆందోళన నడుమ స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తూ ఎంపీలు వాయిదా తీర్మానం అందజేశారు. అలాగే స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. అయితే చర్చకు తాము సిద్ధమేనని, ప్రతిపక్షలే సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని కిరణ్ రిజిజు అన్నారు. దేనిపై చర్చించాలో వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.

