కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో భారీ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తన తొలి మ్యాచ్‌ను రేపు (శనివారం) ఆడనుండటంతో అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుక కోసం నగరంలోని క్రికెట్ ప్రేమికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్ సందర్భంగా ధోనిపై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తాన్ని పసుపు రంగుతో నింపేయాలని, ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ధోని (MS Dhoni) బ్యాటింగ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అభిమానులు తరలివస్తుండటంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలు సందడిగా మారనున్నాయి. ఈ సీజన్‌లో ధోని మొదటి మ్యాచ్ కావడంతో రికార్డు స్థాయిలో జనం హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
-హైదరాబాద్లో ధోని క్రేజ్..
-ఐపీఎల్ ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తో ధోని ఎంట్రీ
– ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీగా కటౌట్లు ఏర్పాటు #MSDhoni #IPL #Hyderabad #UppalStadium #CSKvsSRH #Kalam #KalamDaily #KalamTelugu@DHONIism @imDhoni_fc @msdfansofficial @msdhoni7781 pic.twitter.com/VNtrwp98hp— Kalam Daily (@kalamtelugu) April 17, 2026
Read Also: తెలంగాణలో ‘బాల్యం’ బందీ.. ప్రమాదకర పనుల్లో 89,000 మంది పిల్లలు!
Follow Us On : WhatsApp

