కామారెడ్డిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ లంచం కేసులో ఏసీబీ (ACB) వలలో చిక్కిన ఘటన సంచలనం రేపుతోంది. గ్రామాల్లో కల్లు దుకాణాల తరలింపు విషయంలో కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు.. రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీఐను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం బిచ్కుందలోని ఆయన కిరాయి ఇంటిపై సోదాలు నిర్వహించగా, అదనంగా 47 వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు సీఐ సత్యనారాయణను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్‌కు తరలించారు.

Read Also: తెలంగాణలో ‘బాల్యం’ బందీ.. ప్రమాదకర పనుల్లో 89,000 మంది పిల్లలు!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>