ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. హుటాహుటిన అధికారులు మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని వెల్లడించారు. బెదిరింపు కాల్ చేసింది ఎవరు? ఎందుకు కాల్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: తెలంగాణలో ‘బాల్యం’ బందీ.. ప్రమాదకర పనుల్లో 89,000 మంది పిల్లలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>