గుజరాత్ వర్సెస్ సీఎస్‌కే.. ఈ మ్యాచ్‌లో అయినా ధోనీ రీఎంట్రీ ఇస్తాడా?

కలం, వెబ్ డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులోకి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంట్రీ ఎప్పుడు? అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni) రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నా ధోనీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు చెన్నై, గుజరాత్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో అయినా ధోనీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అన్నది అభిమానుల్లో భారీ ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం అందరినీ తొలుస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తాడు? ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఇప్పుడు ధోనీ పునరాగమనం కోసం వేచి చూస్తోంది.

గత నాలుగు వారాలుగా ధోనీ కాలిపిక్క గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ధోనీ కోలుకుంటున్నాడని, త్వరగా తిరిగి రావడానికి శ్రమిస్తున్నాడని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపారు. నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడని, అయితే వికెట్ల మధ్య పరిగెత్తే విషయంలో వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోనీ రీహ్యాబ్ సరిగ్గానే జరుగుతోందని, అతడిని నిశితంగా గమనిస్తున్నామని శనివారం వెల్లడించారు.

అయితే సమాచారం ప్రకారం, ధోనీ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయినప్పటికీ కావాలనే జట్టులోకి రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్ల కాంబినేషన్ కుదిరిందని, విజయాలు అందుకుంటున్న సమయంలో ఆ సమతూకాన్ని దెబ్బతీయడం ధోనీకి ఇష్టం లేదని సమాచారం. మరి గుజరాత్‌తో మరికాసేపట్లో జరిగే పోరులో ఎంట్రీ ఇస్తాడో ఇవ్వడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>