కలం, డెస్క్ : యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ (Mrunal Thakur) కూడా ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఈ మధ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెబుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘హృతిక్ రోషన్ తో నేను సూపర్ 30 సినిమా చేస్తున్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కూడా షూట్ కు వచ్చాడు. హృతిక్ ఫిజిక్ చూసి అతను కూడా జిమ్ కు వెళ్లి కండలు పెంచాడు. ఎందుకు అని అడిగితే.. నీ చుట్టూ ఉన్న హీరోలతో నేను పోటీ పడి ఫిట్ గా కనిపించాలి. లేదంటే నువ్వు నన్ను వదిలేస్తావేమో అనిపిస్తోంది అని చెప్పాడు. కానీ కొద్ది రోజులకే మళ్లీ బరువు పెరిగాడు’ అంటూ తెలిపింది మృణాల్ ఠాకూర్.
తన బాయ్ ఫ్రెండ్ అలా ఇతరులతో పోల్చుకుని మానసిక ఒత్తిడికి లోనవడం చూసి బాధపడ్డానని.. కానీ ఎప్పుడూ అలా ఇతరులతో పోటీ పడమని తాను చెప్పలేదని మృణాల్ (Mrunal Thakur) వెల్లడించింది. ఆ బంధంలో తాను ఎంతో నిజాయితీగా ఉన్నా సరే అది నిలబడలేకపోయిందంటూ ఎమోషనల్ అయింది. ఇప్పుడు తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన ధ్యాస అంతా సినిమాల మీదనే ఉన్నట్టు తెలిపింది మృణాల్ ఠాకూర్.
Read Also: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. జ్యూరీ కమిటీలో కీలక మార్పు
Follow Us On: Pinterest


