Mobile Popup Ad
Mobile Popup Ad

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. జ్యూరీ కమిటీలో కీలక మార్పు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (Gaddar Film Awards) జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది. గతంలో స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్థానంలో, ఇప్పుడు మరో సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రజా కళాకారుడు గద్దర్ స్మారకార్థం ప్రభుత్వం ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అవార్డుల ఎంపికలో పారదర్శకత, ప్రత్యేక విభాగాల పర్యవేక్షణ కోసం ఈ జ్యూరీ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది.

Read Also: స్టార్ యాక్టర్‌కు షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>