Mobile Popup Ad
Mobile Popup Ad

నందిపేట్‌లో ఘనంగా MRPS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా నందిపేట్ మండలంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (MRPS Formation Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండాను ఆవిష్కరించారు. మాదిగ జాతి ముద్దుబిడ్డ మంద కృష్ణ మాదిగ 59 ఉపకులాలకి న్యాయం చేసినటువంటి రిజర్వేషన్లు, పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు, హార్ట్ ఆపరేషన్లుకు ఆరోగ్య శ్రీ కార్డు, వికలాంగుల పెన్షన్లు, మందకృష్ణ మాదిగా చేసిన 32 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అని నందిపేట్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పైడాకుల ప్రశాంత్ మాదిగ, గుర్తు చేశారు.

అలాగే మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పైడాకుల ప్రశాంత్ మాదిగ, మండల సీనియర్ నాయకులు కలిగోట్ సంతోష్ మాదిగ, తల్వేదా రవి మాదిగ, నరేంద్ర మాదిగ మురళి, చిందు కళాకారులు చిరంజీవి, సుమన్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: వానల్లేవ్.. రాష్ట్ర ఖజానాకు కష్టమే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>