కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కేంద్రం కొత్తగూడెంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ (Ambedkar Community Hall) నిర్మాణానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) రూ.20 లక్షలు ప్రకటించారు. ఈ నిధులను తన ఎంపీ ల్యాడ్స్ ఫండ్ నుంచి విడుదల చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నవతన్ చేసిన విజ్ఞప్తి, అలాగే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో పర్యటిస్తున్న ఎంపీ రవిచంద్రను నవతన్ కలిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వివరించారు. తన విజ్ఞప్తి పట్ల వెంటనే సానుకూలంగా స్పందించడంతో నవతన్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

